చరిత్ర
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుండి విభజింపబడినది. దీని చుట్టూ ఆదిలాబాద్, మంచిరాల, నిర్మల్ జిల్లాలు మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతంగా ఉన్నాయి.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలలు మరియు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అనే రెండు రెవెన్యూ విభాగాలను కలిగి ఉంది. జిల్లా ప్రధాన కార్యాలయం ప్రధానంగా గిరిజన పట్టణమైన ఆసిఫాబాద్ లో కలదు. భారతదేశం యొక్క దక్షిణ మరియు ఉత్తరాలను కలిపే రైల్వే మార్గం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గుండా వెళుతుంది. సిర్పూర్-కాగజ్ నగర్ జిల్లాలో ఒక ప్రధాన రైల్వే స్టేషన్. ఈ జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో కూడా ఉంది.
జిల్లా లో ప్రాధమిక పంటలైన వరి, పత్తి మరియు పప్పుధాన్యాలు పండిస్తారు. ఈ జిల్లాలో సింగరేని, సిర్పూర్ పేపర్ మిల్లు, స్పిన్నింగ్ మరియు జిన్నింగ్ మిల్లులు పారిశ్రామిక ప్రాంతాలు కలవు.
“ఈ జిల్లాకు అద్భుతమైన చారిత్రాత్మక గతం ఉంది, పూర్వపు పాలకుల విషయాలలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ ఒక ముఖ్యమైన భాగం. జిల్లాలో మరియు చుట్టుపక్కల తవ్విన పూర్వ-చారిత్రక కాలం యొక్క శిలాజాలు ఈ ప్రదేశానికి పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కుమురం భీమ్ ప్రాజెక్టు, గంగాపూర్ కేవ్, మోవ్వాడ్ గ్రామం పర్యాటక ఆకర్షణలు.