ముగించు

జిల్లా గురించి

కొమరంభీం జిల్లాగిరిజన పక్ష పోరాట యోధుడు కొమురం భీమ్ జల్..జంగల్..జమీన్.. అంటూ నినదించి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు పురిటిగడ్డ ఈ ఆసిఫాబాద్ జిల్లా.

కొమురం భీమ్ తో పాటు మరెందనో పోరాట యోధుల జన్మించింది ఈ ప్రాంతంలోనే.ఒకప్పుడు ఈ పట్టణం జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో మళ్లీ జిల్లా పరిపాలన ప్రధాన కేంద్రంగా కొమురం భీమ్ పేరుతో 2016 అక్టోబరు 11న అవతరించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్.

జిల్లాలోని మండలాలు

  1. ఆసిఫాబాద్ మండలం
  2. కేరమెరి మండలం
  3. రెబ్బెన మండలం
  4. తిర్యాని మండలం
  5. వాంకిడి మండలం
  6. జైనూర్ మండలం
  7. సిర్పూర్-యు మండలం
  8. లింగాపుర్ మండలం
  9. కగజంగర్ మండలం
  10. బెజ్జూర్ మండలం
  11. సిర్పూర్-టి మండలం
  12. కౌటాల మండలం
  13. దహేగం మండలం
  14. చింతలమనేపల్లి మండలం
  15. పెంచికల్ పేట్ మండలం