ముగించు

మిట్ట జలపాతం

వర్గం సహజ/రమణీయమైన సౌందర్యం

తెలంగాణాలో ఔరా అనిపించే మిట్ట వాటర్ జలపాతం.. 

తెలంగాణాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలెన్నో ఉన్నాయి. తెలంగాణాలో కొమురంభీం యుద్ధబేరి మోగించిన జోడేఘాట్ ఇప్పుడు ప్రకృతి అందాలతో పలకరిస్తున్నది. సప్తగుండాల జలపాతాలు సరికొత్త స్వరాలు వినిపిస్తున్నాయి. కేరమెరి ఘాట్ రోడ్ కొత్త దారులు తెచుకుంటున్నది. అంతే కాదు పాండవుల గుహలు, రాప్పదేవాలయం, సోమశిల ఇలా ఎన్నెన్నో అద్భుతాలకు నెలవు తెలంగాణ. జలజల పారే సెలయేళ్ళు.. పైనుండి దూకే జలపాతాల నడుమ ఆకుపచ్చని అడవులు..కొండగుహలు..ఎత్తైన రహదారుల..చారిత్రక నిర్మాణాలు..ఇంకా ఎన్నెన్నో అందాలు ప్రకృతిలోని అందాలన్నీ ఒకచోట కుప్పబోసినట్లు కనువిందు చేస్తాయి. అలాంటి వాటిలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సహజ సిద్ధంగా ఏర్పడిన మిట్ట వాటర్ ఫాల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సహజ సిద్ధమైన ప్రకృతి అందాలెన్నో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలెన్నో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దర్శనమిస్తాయి. అడవి నడుమ పారే గోదావరి గలగలలు.. ఎత్తైన జలపాతాలు అలరిస్తుంటాయి. సప్తగుండాల జలపాతం  పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వాటిల్లో పిట్టగూడ గ్రామ సమీపంలో గల మిట్ట వాటర్ ఫాల్ చూస్తే ఔరా అనిపిస్తుంది. వందల ఎత్తైన కొండ చరియల నుంచి జలజలా జారే జలపాతం.. వందల ఎత్తైన కొండ చరియల నుంచి జలజలా జారే జలపాతం.. కింద ప్రవహించే నీరు… చుట్టూ దట్టమైన అడవి.. నిజంగా ఆఫ్రికా అడవుల్లో ఉన్న అనుభూతి కలిగిస్తోంది. ప్రకృతి అందాలకు, ఆదివాసిల ఆటపాటలకు, అందాల జలపాతాలకు హస్తకళలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు ఉమ్మడి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.

ఒక వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని ఉన్న ఒక వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని ఉన్న కుంటాల జలపాతం..మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరీ పర్వత పంక్తుల అందాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. జిల్లాలోని మిట్ట జలపాతం అందాలు చూడాలంటే కెరమెరి ఘాట్ ను దాటుకుంటూ వెళ్ళాలి.

కెరమెరి పర్వత పంక్తులు ప్రారంభంలో ఒక ఎత్తైన మంచెను ఆనాటి నిజాం పాలకులు నిర్మించారు. దాని పై నుండి ప్రకృతి అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు. గిరిజన వీరుడు కొమురం భీం ప్రాణాలు అర్పించిన జోడేఘాట్ పర్వత పంక్తులు సైతం ఈ కెరమెరి పర్వతాలను ఆనుకుని ఉండటం విశేషం.

ఇక్కడికి చేరుకోవాలంటే ఆసిఫాబాద్ -ఉట్నూర్ రహదారి వెంట ప్రయాణం చేసేటప్పుడు చుట్టుపక్కల అందాలను వీక్షిస్తూ పరవశించిపోవాల్సిందే. కుంటాల ..పోచ్చేర..గాయత్రి…కనకాయ్ ..జలపాతాలు జిల్లాకు అదనపు ఆకర్షణగా అందాన్ని తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కొత్తగా ఏర్పాటు అయిన అసిఫాబాద్ కోమురంభీం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు మిట్ట జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

పచ్చని ప్రకృతి నడుమ నడుచుకుంటూ వెళుతుంటే అసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన లింగాపూర్ మండంలోని పిట్టగూడా నుండి 3కిలోమీటర్లు కాలినడకన వెళితే గాని మిట్ట జలపాతానికి చేరుకోలేం. పచ్చని ప్రకృతి నడుమ నడుచుకుంటూ వెళుతుంటే సందర్శకుల ఆనందానికి అవదులుండవంటే అతిశయోక్తి కాదు. అక్కడికి చేరుకోగానే ఒక్కదానికి పక్కనే ఒకటి 7 జలపాతాలు దర్శనమిస్తాయి. వీటితే సప్తగుండాలు లేదా సప్త జలపాతాలు అని పిలుస్తారు.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • మిట్ట జలపాతం
    మిట్ట జలపాతం
  • మిట్ట జలపాతం
    మిట్ట జలపాతం
  • మిట్ట జలపాతం
    మిట్ట జలపాతం

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

సమీప విమానాశ్రయం హైదరాబాద్, నాగపూర్

రైలులో

సమీప రైల్వే స్టేషన్లు ఆసిఫాబాద్ రోడ్డు, సిర్పూర్ కాగజ్ నగర్

రోడ్డు ద్వారా

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన లింగాపూర్ మండంలోని పిట్టగూడా నుండి 3కిలోమీటర్లు కాలినడకన వెళితే మిట్ట జలపాతానికి చేరుకుంటాం.

దృశ్యాలు